India Cycles 4 Change

సైకిల్స్4ఛేంజ్‍ కార్యక్రమానికి రాజధాని హోదాలో అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రజా రవాణా వ్యవస్థ కింద సైక్లింగ్‍ను ప్రోత్సహించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, 5 లక్షల జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీల్లో తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 17 నాటికి 107 నగరాలు నమోదు చేసుకున్నాయని, అందులో ఆంధప్రదేశ్‍ నుంచి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‍దీప్‍ సింగ్‍ రాజ్యసభలో చెప్పారు.