Woman pilot picked for Rafale two others set to fly warship choppers

అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ విహంగ వీక్షణం చేస్తున్నారు. భారత వాయు సేన, నౌకా దళాల్లో మహిళ యుగం ప్రారంభమైంది. భారత యుద్ద నౌకల్లో ఇద్దరు మహిళా నేవీ అధికారులను ప్రభుత్వం తాజాగా నియమించగా, వైమానిక దళంలో అత్యంత కీలకంగా మారిన రాఫెల్‍ యద్దు విమానాన్ని త్వరలోనే ఓ మహిళా పైలెట్‍ నడపున్నారు. భారత నౌక దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు సబ్‍ లెఫ్టినెంట్‍ రితీ సింగ్‍, సబ్‍ లెఫ్టినెంట్‍ కుముదిని త్యాగి యుద్ధ నౌకల కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. నౌకా దశంలోని పలు ర్యాంకుల్లో మహిళ అధికారులు సేవలు అందిస్తున్నప్పటికీ, యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియమించడం ఇదే తొలిసారి.

కొత్తగా పోస్టింగ్‍ అయిన ఇద్దరు అధికారిణిల్లో రితీసింగ్‍ హైదరాబాద్‍కు చెందినవారు కాగా, త్యాగి యూపీలోని ఘజియాబాద్‍కు చెందిన వారు. రాఫెల్‍ యుద్ధ విమానాన్ని భారత వాయుసేనకు చెందిన ఓ మహిళా పైలెట్‍ త్వరలోనే నడుపనున్నట్టు వాయుసేన వర్గాలు తెలిపారు. అయితే ఆ మహిళా ఫైలెట్‍ వివరాలను మాత్రం వెల్లడించలేదు.