Mahesh Babu Fans on Twitter 14 100K tweets

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో మరో సారి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.  సూపర్ స్టార్  కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్  తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్‌ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లు దాటింది. దీంతో ఇప్పటికే సౌత్‌ ఇండియాలో 10.6 మిలియన్ల ట్విట్టర్‌ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్‌ రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ఏకైక నటుడు మహేషే. అయితే ఇప్పుడు ట్విట్టర్ లోనే ఈయన మరో రికార్డ్ క్రియేట్ చేశాడు.

ట్విట్టర్ లో 100 K లైక్స్ సాధించిన అత్యధిక ట్వీట్స్ మహేష్ పేరిట నమొదయ్యాయి. ఇప్పటికే ఆయన చేసిన 13 ట్వీట్లు ఇప్పటికే 100 K లైక్స్ సాధించగా తాజాగా మహేష్ బాబు నరేంద్ర మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన ట్వీట్ కి కూడా 100 K లైక్స్ దాటాయి. దాంతో మొత్తం మహేష్ 100 K లైక్స్ ట్వీట్స్ 14కు చేరాయి. ఇక 2010 ఏప్రిల్‌లో ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన మహేష్ బాబు, అప్పటినుండి ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన అప్ డేట్స్‌ అభిమానులతో పంచుకుంటున్నాడు. మహేష్ ఈ రికార్డు సొతం చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మా వాడిని ఎవ్వరు దాటలేరు  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదటిలో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు. ఈయన ముందే తన తదుపరి సినిమాకి ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా కరోనా ఎంటర్ కావడంతో ఆయన మరింత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కరోన దెబ్బకు అతని తదుపరి ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మరింత ఆలస్యం అవనుంది. ఈ సినిమా షూట్ ఈ ఏడాది నవంబర్ లో మొదలు కావచ్చని అంటున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.