Rajya Sabha suspends 8 opposition MPs

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆందోళన నిర్వహించిన 8 మంది ఎంపీలపై సభ చైర్మన్‍, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సస్పెన్షన్‍ వేటు వేశారు. కాంగ్రెస్‍ ఎంపీలు రాజీవ్‍ సత్వ, సయ్యద్‍ నాసిర్‍ హుస్సేన్‍, రిపున్‍ బోరా, టీఎంసీ సభా నాయకుడు డెరెక్‍ ఒబ్రెయాన్‍తో పాటు ఆ పార్టీ ఎంపీ డోలాసేన్‍, ఆప్‍ సభ్యుడు సంజయ్‍సింగ్‍, సీపీఎం ఎంపీలు కేకే రాజేశ్‍, ఎలమారన్‍ కరీమ్‍లను పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‍ చేస్తున్నట్టు ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్‍ హరివంశ్‍ నారాయణ్‍సింగ్‍పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను కూడా చైర్మన్‍ తిరస్కరించారు.