ap-government-released-rs-50-crores-to-construct-the-kadapa-steel-plant/

వైఎస్సార్‍ జిల్లాలో ఏపీ  హైగ్రేడ్‍ స్టీల్స్ లిమిటెడ్‍ (ఏపీహెచ్‍ఎస్‍ఎల్‍) పేరుతో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా ఎంపిక చేయడం, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం రూ.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‍ ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‍లో ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.250 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.72.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.