corona deaths in usa

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. జాన్స్ హోప్‍కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ఆదివారం సాయంత్రానికి అమెరికాలో 1,99,479 మంది కరోనాతో మరణించారు. కరోనా బాధితుల సంఖ్య 60 లక్షల 70 వేలు దాటింది. శనివారం కొత్తగా 41 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే రోజువారీ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఉతాహ్‍, మోంటనా రాష్ట్రాల్లో గతంలో కంటే అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి.