YS Jagan launches Police Seva App

ఆంధప్రదేశ్‍ పోలీస్‍ సేవ యాప్‍ను ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍రెడ్డి ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్తగా రూపొందించిన ఈ యాప్‍ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‍స్టేషన్లను అనుసంధానిస్తూ ఆ యాప్‍కు రూపకల్పన చేశారు. పోలీస్‍స్టేషన్‍కు వెళ్లే అవసరం లేకుండానే ప్రజలకు 87 రకాల సేవలు దీని ద్వారా అందనున్నాయి. పోలీస్‍స్టేషన్‍ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‍ యాప్‍ ద్వారా పొందే అవకాశం కల్పించారు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయడమే కాకుండా వాటిని రసీదు సైతం లభించేలా యాప్‍ను తీర్చిదిద్దారు. యాప్‍ పని చేసే విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రి జగన్‍కు వివరించారు. సిటిజన్‍ ఫ్రెండ్లీ పోలీసింగ్‍లో భాగంగా యాప్‍ను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన 12 మాడ్యూల్స్ను ఇందులో చేర్చామన్నారు.