Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 56,569 శాంపిల్స్ ను పరీక్షించగా.. 6,235 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‍ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 51,60,700 శాంపిల్స్ ను పరీక్షించగా, 6,28,854 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇప్పటి వరకు 5,48,926 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 5410 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 74,518 మంది బాధితులు వివిధ కొవిడ్‍ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‍లో తెలిపింది.