Amaravati-Woman-Farmers-Meets-MP-Kanimozhi-in-Delhi

అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవస్యకతను తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఐకాస నాయకులను కనిమొళి వద్దకు తీసుకెళ్లారు. ఐకాస నేతలు సుంకర పద్మశ్రీ, వనజ, తంగిరాల సౌమ్యతోపాటు మహిళా రైతులు అమరావతి అంశాన్ని కనిమొళికి వివరించారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం ఎంపీ గల్లా జయదేవ్‍ నివాసంలో టీడీపీ ఎంపీలతో వారంతా భేటీ అయ్యారు. రాజధాని అంశాన్ని జాతీయనేతల దృష్టికి తీసుకెళ్లే అంశాన్ని చర్చించారు.