CM YS Jagan Tirumala Tour Schedule

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్‍ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3:50 గంటలకు మఖ్యమంత్రి జగన్‍ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‍కు చేరుకుంటారు. సాయంత్రం గం. 6:20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం 8:10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్‍ జగన్‍ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 11:30 గంటలకు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు.