1302 new corona positive cases in telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 31,095 శాంపిల్స్ని పరీక్షించగా 1,302 మందికి పాజిటివ్‍ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,72,608కి చేరింది. మహమ్మారితో నిన్న ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1042గా ఉంది. తాజాగా 2,330 మంది వైరస్‍ నుంచి కోలుకుని డిశ్చార్జికాగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,41,930గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో 29,636 యాక్టివ్‍ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‍ విడుదల చేసింది. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలో 266 కేసులు నమోదుకాగా, కరీంనగర్‍లో 102, రంగారెడ్డిలో 98, సిద్దిపేటలో 92, నల్గొండలో 70 మందికి పాజిటివ్‍ నిర్ధారణ అయ్యింది.