TATVA Rangasthalam 2020 event

నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి మంచి వేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పలు రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

ఈసారి కోవిడ్ మహమ్మరి వల్ల ఇన్ పర్సన్ గా చేయడానికి అవకాశం లేనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సాంకేతికను ఉపయోగించుకుని ఆన్లైన్ లో రంగస్థలం చేయడం జరిగింది. దానికి కమ్యూనిటీ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు నాలుగు గంటల పాటు పిల్లలు, పెద్దలు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్లు పలు సినిమా పాటలతో, సినిమా డాన్సులతో, శాస్త్రీయ గీతాలు శాస్త్రీయ నృత్యాలతో పాటు కధ చెబుతామని, అనగనగా అని వివిధ రకాలైన స్కిట్లు కూడా చేసారు. అలానే పలు విధాలైన ఇన్స్ట్రుమెంట్లని ప్లే చేసి వారికున్న నైపుణ్యాన్ని చూపించుకోవటానికి ఈ వేదికను అందరు వినియోగించుకున్నారు. మనకున్న సాంకేతికను ఉపయోగించుకుని ఆన్లైన్ లో పాడటమే కాకుండా వాళ్లు ముందుగా రికార్డు చేసిన డాన్స్ లని, స్కిట్ లని ఈ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రదర్శన చెయ్యటం జరిగింది.

ఎంతో మంది పిల్లలు వాళ్లకున్న ఎన్నో నైపుణ్యాలను ఆన్లైన్ లో చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఎవరూ ఎక్కడికి వెళ్లకుండా వాళ్ల ఇళ్లలోనే ఉంటూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో మరియు యుట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ చెయ్యటం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు మాత్రమే కాకుండా వాళ్ల తో పాటు అన్ని దేశాలలో ఉన్న వారి వారి బంధుమిత్రులు చూసి ఆనందించటం జరిగింది.

మహాద్భుతంగా జరిగిన రంగస్థలం ట్రైవాలీ లోని తెలుగు వారినే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టిసిపంట్స్ బంధుమిత్రులను కూడా విశేషంగా ఆకట్టుకున్నది. ఇంత చక్కటి వినోదకరమైన కార్యక్రమాన్ని అందించినందుకు పార్టిసిపంట్స్, వారి తల్లిదండ్రులు, టీచర్లు, ఆన్లైన్ లో చుసిన బంధుమిత్రులు తత్వా వారి ప్రయత్నాన్ని అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవ్వరినీ కలుసుకునే వీలు లేనప్పటికీ తత్వా వారు ఇంత విశాలంగా ఆలోచించి ఈ అవకాశాన్ని పిల్లలకు కలిగించినందుకు తత్వా వారి కృషిని పిల్లల తల్లిదండ్రులు ఎంతో అభినందించారు.

తత్వా నుండి రామ్ కొడితాల గారు మాట్లాడుతూ దీనికి విశేషంగా సహకరించిన NATS కార్యవర్గానికి, స్పాన్సర్లు ISSQUARED మరియు Firebolt వారికి, సాంకేతికం గా సహకారం అందించిన NRIStreams వారికి, అలానే స్థానికం గా సహకారం అందించిన TASC, గ్రాండ్ బావర్చి, మరియు R&M వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమం లో పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వారి గురువులకు, కొరియోగ్రాఫర్లకు, కొఆర్డినేటర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలానే తత్వా బృందం బిందు పోలవరపు, చందు నంగినేని, డాంజీ తోటపల్లి, హరి ర్యాలి, జగన్ జటావల్లభుల, కిషోర్ రామధేను, కుమార్ తాలింకి, లక్ష్మి బొల్లాపల్లి, నీలిమ టంగుటూరి, రామ్ కొడితాల, శైలజ మద్దాలి, వెంకట్ చెరుకుపల్లి, వెంకట్ ఓరుగంటి, విజయ్ భీమిశెట్టి, మరియు విజయ్ కాసనగొట్టు గార్లకు శుభాభినందనలు తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సాంకేతికను వాడుకుని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరు కూడా అభినందించారు. తత్వా వారు ఇలా సంస్కృతి సాంప్రదాయాలకే కాకుండా సామాజిక సేవ లో కూడా ముందు ఉంటారన్నవిషయం అందరికి తెలిసిందే. వెంచురా ఫైర్ ఫైటర్స్ కి ఆర్ధికంగా సాయం చేసి, వారి సేవల్ని తత్వా వేదిక పైన గతం లో ఘనంగా సత్కరించారు. అలానే సిమివ్యాలి పోలీస్ డిపార్ట్ మెంట్ వారిని గత సంవత్సరం లో సత్కరించారు. ఈ సారి కోవిడ్ మహమ్మారి మొదలవ్వగానే మాస్కుల అవసరాన్ని గుర్తించి వెంటనే రంగంలో దిగి తత్వా వారు స్థానికం గా ఉన్న తెలుగు వారి సహకారంతో ఇళ్లలోనే మాస్కులు కుట్టించి ఎమర్జెన్సీ హాస్పిటల్ కి అందజేయటం జరిగింది. దానికి వారు చాలా సంతోషించారు. క్రిందటి ఏడాది జరిగిన రంగస్థలంలో భాషాభివృద్దికి, లలిత కళల అభివృద్దికి తమ సేవను అందిస్తున్న స్థానిక గురువులను వేదికపై సత్కరించారు. ఇలా తత్వా వారు ముందు ముందు మరెన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు వారిని ఒక వేదిక పైకి తీసుకురావాలని అందరు ఆశాభావం వ్యక్తం చేసారు.

Click here for Photogallery