Will nominate a woman next week to replace judge Ruth Bader Ginsburg says Donald Trump

సుప్రీంకోర్టు న్యాయమూర్తి గిన్స్బర్గ్ మరణానంతరం అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ మధ్య పోరు మరింత పెరిగింది అనే చెప్పాలి ఇది సెనేట్లో రాజకీయ పోరాటానికి దారితీసినట్లు సమాచారం. వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాదర్ గిన్స్బర్గ్ స్థానంలో ఒక మహిళను ఎంపిక చేస్తాం అని అధ్యక్షులు ట్రంప్ 19 సెప్టెంబర్ శనివారం ప్రకటించారు.

ఫాయెట్‌విల్లేలోని విమానాశ్రయంలో బహిరంగ సమావేశంలో అధ్యక్షులు ట్రంప్ మద్దతుదారులతో “నేను వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా ఒక స్త్రీ ని ఎంపిక చేస్తాము.నేను పురుషులను ఇష్టపడే దానికంటే ఎక్కువగా ఆ స్థానానికి మహిళలను ఇష్టపడతాను” అని ప్రకటించారు.అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన పై మైనే రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్ సెనేట్ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నామినీ కి ఓటు వేయరాదని అన్నారు. “నేను ఆమెతో పూర్తిగా విభేదిస్తున్నాను, మాకు ఒక బాధ్యత ఉంది. మేము గెలిచాము. మరియు మనకు కావలసిన వారిని ఎన్నుకోవటానికి విజేతలుగా మాకు ఒక బాధ్యత ఉంది” అని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సెనేటర్ సుసాన్ కి సమాధానం చెప్పడం తో మాటల యుద్ధం చోటు చేసుకుంది.

జస్టిస్ గిన్స్బర్గ్ స్థానంలో ఒక మహిళని రిపబ్లికన్లు ఎంపిక చేస్తాం అని ప్రకటించటం తో, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ సెవెంత్ సర్క్యూట్ సభ్యులు అమీ కోనీ బారెట్ రేస్ లో ముందు ఉన్నట్టు సమాచారం. క్యూబన్-అమెరికన్ మరియు ఫ్లోరిడా సుప్రీంకోర్టుకు నియమించిన మొదటి హిస్పానిక్ మహిళ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ సెవెంత్ సర్క్యూట్ సభ్యులు బార్బరా లాగోవా కుడా రేస్ లో ఉన్నట్టు సమాచారం.