PM Modi to Discuss Coronavirus Situation with CMs of 7 States on September 23

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ప‌ర‌స్థితి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి ఎక్కువ కరోనా కేసులు భార‌త‌దేశంలో నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,00,619కి చేరగా..ఇప్పటి వరకు 86,752 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన శనివారం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల మేరకు రికవరీ రేటు 79.28గా ఉంది. ఇది మాత్రం  ఊరటనిచ్చే అంశమే. 

ఆ ఆ రాష్ట్రాల ప‌రిస్థితి ఆందోళ‌న క‌రం..

దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌న్నీ ఒకెత్త‌యితే దేశంలోని 7 రాష్ట్రాలు మాత్ర‌మే ఒకెత్త‌న్న‌ట్టుగా ఉంది. అంత‌కంత‌కూ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌న‌క‌రంగా ప‌రిణ‌మిస్తూ... అత్యధిక కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల్లో దిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, ప‌శ్చిమ‌బెంగాల్‌లు ఉన్నాయి.  దాదాపుగా దాదాపు 60 శాతం కేసులు  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్,  రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  శ‌నివారం నాటికి మ‌హారాష్ట్ర‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,01,273 కాగా, మొత్తం కేసుల సంఖ్య 11ల‌క్ష‌ల 67, 496. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  6ల‌క్ష‌ల పైచిలుకు పాజిటివ్ కేసులుండ‌గా 80వేల వ‌ర‌కూ యాక్టివ్ కేసులున్నాయి. క‌ర్ణాట‌క‌లో 101,148 యాక్టివ్ కేసులుండ‌గా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5ల‌క్ష‌లు దాటింది. అలాగే మొత్తం 3,42,788 పాజిటివ్ కేసులూ,  67,825యాక్టివ్ కేసుల‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మొత్తంగా 5ల‌క్ష‌ల పైచిలుకు పాజిటివ్ కేసుల‌తో పాటు 40వేల 506 యాక్టివ్ కేసుల‌తో త‌మిళ‌నాడు క‌రోనా కి కేరాఫ్ స్టేట్స్‌లా ఉన్నాయి. వీటిలో మ‌ర‌ణాల సంఖ్య ప‌రంగా 31వేల పై చిలుకు మ‌ర‌ణాల‌తో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో  ఉండ‌గా, 4వేల పైన మ‌ర‌ణాల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చిట్ట చివ‌రి స్థానంలో ఉంది. 8వేలు దాటిన త‌మిళ‌నాడు రెండో స్థానంలో దాదాపు అంతే స్థాయిలో క‌ర్ణాట‌క మూడో స్థానంలో 5వేల పైచిలుకు మ‌ర‌ణాల‌తో ఆంధ్ర‌ప్రదేశ్ 4 వ‌స్థానంలో ఉన్నాయి. 

భేటీ 23న‌...

ఈ నేప‌ధ్యంలోనే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం దాదాపు ఖాయ‌మైంది. ఈ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నివారణకు ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. క‌రోనా వ్యాప్తికి కార‌ణంగా మారుతున్న ఆయా రాష్ట్రాల నియంత్ర‌ణ‌ చ‌ర్య‌ల‌లోని లోపాల‌పై కూడా ఇప్ప‌టికే కేంద్రం త‌మ‌దైన నివేదిక‌ల‌ను రూపొందించిన‌ట్టు స‌మాచారం.  ఈనేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.