PV Narsimha Rao Centenary Celebrations in Toronto

-- 365 డిగ్రీస్ మనిషి, స్నిథప్రగ్యుడు  PV గారు - కేశవ రావు గారు
-- భూ సంస్కరణలు చేప్పట్టిన మహోన్నత మనిషి - వినోద్ కుమార్ గారు
-- భారత రత్న కి అర్హులు, కెనడా లో PV మార్గ్ - మహేష్ బీగాల గారు
-- ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు - పి.వి.ప్రభాకర్ రావు గారు

PVNR శతజయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కెనడాలోని టొరంటో నగరంలో పివిఎన్ఆర్ గారి శతజయంతి  వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి  శ్రీ కె. కేశవ రావు గారు, బోయిన్‌పల్లి వినోద్ కుమార్ గారు, పి.వి.ప్రభాకర్ రావు గారు మరియు మహేష్ బిగాల గారు Zoom కాల్ ద్వారా హాజరయ్యారు.

కె. కేశవ రావు గారు మాట్లాడుతు PVNR గారికి సరైన గుర్తింపు కోసం KCR గారు మరియు TRS ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు. 360 డిగ్రీస్ వ్యక్తి , ఈరోజు ఎక్కడ చుసిన పీవీ  గారు మహోన్నత వ్యక్తి అని మనందరికీ అన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం, పీవీ గారు స్నిథప్రగ్యుడు , మహాత్మ గాంధీ గారు చెప్పినట్టు దున్నేవానిది భూమి అన్నట్టు, పీవీ గారు తెచ్చిన భూ సంస్కరణ వాళ్ళ ఎంతో మందికి మేలు జరిగింది, పీవీ గారు సద సీదా జీవితముని గడిపారు, బాల్యములో లో వున్నపుడే ఎన్నో కార్యక్రమాలలో పీవీ గారు పాల్గొన్నారు, జైలు లో రిఫార్మ్స్ ఇసుకువచ్చారు, ఓపెన్ జైలు సిస్టం ప్రపంచములో మొట్ట మొదటగా చేసింది పీవీ గారు, దేవాదాయ శాఖలో కూడా ఎన్నో రకాలుగా మార్పులు తెచ్చారు, ఏ శాఖలో వున్నా ఆ శాఖకే వన్నె తెచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ గ చేంజ్ చేసారు, పేదవాళ్ళకి రెసిడెంటిల్ స్కూల్స్ పెట్టారు, చాల మంది ఆ పాఠశాలలో చదివి చాల మంచి మంచి స్థానాలలో వున్నారు.  ఇలా చెబుతూ ఎన్నో విషయాలను  కేశవరావు గారు నెమరు వేసుకున్నారు.

బోయిన్‌పల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగటం చాల గొప్ప విషయం, విద్యార్ధి దశ నుండే నేను  పీవీ గారిని దగ్గరగా  చూసాను. పీవీ గారు తీసుకున్న భూ సంస్కరణలు చేప్పట్టి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు, రానున్న రోజులోపల అన్ని రాజకీయా పార్టీలను కలుపుకొని పీవీ గారికి భారత రత్న గౌరవాన్ని ఇప్పించవలసిన బాధ్యత వుంది అని చెప్పారు, పివి గారితో తమ అనుభవాలు, వారు ఎలా ప్రేరణ పొందారు, దేశానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు.

మహేష్ బిగాల గారు మాట్లాడుతు, ఈరోజు అంతర్జాలం లో  విచ్చేసిన సభ్యులందరికి స్వాగతం పలుకుతూ, పీవీ గారి గురించి చెప్పలాంటి ఎంతయినా చెప్పుకోవచ్చు, వివిధ దేశాల్లో PVNR విగ్రహం ఏర్పాటు ప్రయత్నాల గురించి, భారతరత్న అవార్డు కోసం జరుపుతున్న ప్రచారం గురించి, సంవత్సరం పొడవునా జరిపే ఉత్సవాల ప్రణాళికల గురించి వివరించారు. కెనడా లో వున్నా ముక్యంగా భారతసంతతి కి సంబంధించిన అందరిని సంప్రదించి అక్కడ పీవీ మార్గ్ పెట్టె ఆలోచనలో వున్నారు అని తెలిపారు, పీవీ గారికి భారత రత్న గురించి అన్ని రకాలుగా  ప్రయత్నాలు ముమ్మరం చేసారు అందరి మద్దతుతో పీవీ గారికీ భారత రత్న ఇవ్వాలని దానికి సంబంధించి  ఆన్లైన్ లో పిటిషన్ (https://www.change.org/BharatRatnaforPV) ద్వారా ప్రపంచమంతటా పీవీ అభిమానులు ఆన్లైన్ లో తమ మద్దతు తెలియజేయాలని అన్నారు , మన అందరికి తెలుసు పీవీ గారు చాల పెద్ద భూ సంస్కర్త, ఈ సందర్బంగా ఒకటి గుర్తు చేస్తున్నాను , కొద్దీ రోజుల క్రితం గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మండలి లో చెబుతూ ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌ లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదైనా రుజువు పత్రం తీసుకొని వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తామని, అందరికి మేము అండగా ఉంటాం అని  సీఎం గారు  చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రెవిన్యూ ఆక్ట్ మార్చడం ద్వారా  ప్రపంచవ్యాప్తంగా ఉన్నా తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుందని మహేష్ అన్నారు. చరిత్రలో ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ప్రశంసించారు.

పి.వి.ప్రభాకర్ రావు గారు మాట్లాడుతు, PVNR గారి గురించి తెలియని అనేక విషయాలు వివరించారు.నెల్సన్ మండేలా గారు అన్నట్టు మంచి మేధస్సు మంచి మనస్స్సు ఉండటం చాల అరుదు, ఈ రెండు పీవీ గారి విషయములో అద్భుతంగా వున్నాయి. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు అయ్యారు. నాయకుడు అనేవాడు భూత కాలాన్ని పరిగణలోకి తీసుకొని వర్తమానాన్ని సమీక్షించి నిర్యాలు తీసుకోవాలి, పీవీ గారికి ఈ మాటలు చక్కగా సరిపోతయి.

కెనడాలో కోవిడ్ ఆంక్షల కారణంగా కృష్ణ కోమండ్ల, వేణు, సాయి రామకృష్ణ, లలిత్, మధు, కరుణకర్ రావు, వినోద్ తదితరుల అద్వ్యర్యములో ఈ కార్యక్రమాన్ని జరిపారు మిగితా వీక్షకులు  జూమ్ ద్వారా హాజరయ్యారు. PVNR శతజయంతి ఉత్సవాల కమిటీ ఇతర సభ్యులు కూడా జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు.