MP Galla Jayadev Raise Voice on Capital Amaravati

రాష్ట్రాల రాజధాని నిర్ణయ అంశాన్ని రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో చేర్చాలని, దీనికిగాను అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదించారు. లోక్‍సభ జీరో అవర్‍లో ఆయన మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు చేసే నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదని పేర్కొంటూ హైకోర్టులో కేంద్ర హోం శాఖ అఫిడవిట్‍ దాఖలు చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఆంధప్రదేశ్‍ రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని, అలాంటప్పుడు బాధ్యత లేదంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.