Over 2 lakh coronavirus deaths in US likely: White House

కరోనా వైరస్‍ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ప్రభుత్వ వైఫల్యానికి అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. దాదాపు 2 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా ముప్పు గురించి ట్రంప్‍ సరిగా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతగా దిగజారింది. మొదటి లక్ష మరణాలు మూడు మాసాల్లో చోటుచేసుకోగా, మిగతా లక్ష మరణాలు రెండు మాసాల్లోనే సంభవించాయి. ఎన్నికలు జరిగే నవంబరు నాటికి ఈ మృతుల సంఖ్య 2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇంత జరిగినా దీనినుంచి పాఠాలు తీసుకోవడానికి ట్రంప్‍ సిద్ధంగా లేరు. కరోనా పై పోరులో ట్రంప్‍ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జర్నిలిస్టు బాబ్‍వుడ్‍వర్డ్ వీడియోల్లో చిత్రించారు. సాంకేతికంగా, ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చేందిన అమెరికా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చేతకాని దద్దమ్మలా వ్యవహరించింది. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే డొనాల్డ్ ట్రంప్‍ హెర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు.