Coronavirus impact Parliament s monsoon session may be curtailed by September 24

పార్లమెంట్‍ వర్షాకాల సమావేశాలను కుదించే అవకాశాలున్నాయి. ఈ నెల 14న మొదలైన సమావేశాలు అక్టోబరు ఒకటో తేదీ దాకా జరగాల్సి ఉంది. సమావేశాలు మొదలయ్యాక, ఎంపీల్లో కరోనా వెలుగుచూడటంతో ఇతర సభ్యులకూ కరోనా సోకే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్‍ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాలను కుదించాలనే ఆలోచనకే ఎక్కువ పార్టీలు మెగ్గుచూపాయి. మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్‍ పటేల్‍తో పాటు 30 మంది దాకా ఎంపీలకు, 50 మంది సిబ్బందికి కరోనా సోకింది.