Government Take No Decision To Stop Printing Of 2000 Notes

రెండేళ్లుగా రూ.2వేల నోట్లను ముద్రించలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‍ సింగ్‍ ఠాకూర్‍ తెలిపారు. వీటి ముద్రణ కోసం 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ముద్రణ కేంద్రాలకు ఎలాంటి దరఖాస్తును పంపలేదని సృష్టం చేశారు. అయితే, 2వేల నోట్ల ముద్రణను పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయాన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని లోక్‍సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రి సమాధానం ప్రకారం గత ఏడాది కాలంలో రూ.2వేల నోట్ల చెలామణి 16.74 శాతం మేర తగ్గింది.