TDP MLA Vasupalli Ganesh joins YSRCP along with sons

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‍ కుమార్‍ కుమారులు వాసుపల్లి సాకేత్‍, వాసుపల్లి సూర్య వైఎస్సార్‍సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి తన నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‍ కుమార్‍ మాట్లాడుతూ వైఎస్సార్‍సీపీలో నా కుమారులు చేరడం సంతోషం కలిగిస్తోంది. ఆంధప్రదేశ్‍ను ముందుకు తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి జగన్‍మోహన్‍రెడ్డి దైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేను టీడీపీకి 13 ఏళ్లపాటు సేవలందించాను. జగన్‍ అమలు చేస్తున్న పథకాలన్నీ అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయి. రానున్న విశాఖపట్నం మున్సిలప్‍ ఎన్నికల్లో వైఎస్సార్‍సీపీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‍, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.