bottle gourd in usa

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చినకళ్లేపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ క్రాంతి కిరణ్‍ అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్‍ ఇంజినీర్‍గా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ తన ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో సొరకాయలను పండిస్తున్నారు. సొంతూరు నుంచి విత్తనాలు తీసుకెళ్లి వేయగా 45 రోజుల్లో కొత్తకొచ్చాయి. సాధారణంగా ఒక పాదు నుంచి 40 నుంచి 50 కాయలు కాస్తుంది. న్యూజెర్సీలో మాత్రం 100కు పైగా కాశాయని కాంత్రి కిరణ్‍ తెలిపారు. వాటిని స్థానికులు ఇష్టంగా తింటున్నారని వివరించారు.