అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం

2 dead and more than a dozen injured in Rochester mass shooting

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్లోని రోచెస్టర్‍లో అర్థరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రోచెస్టర్‍లోని పబ్లిక్‍ మార్కెట్‍ పరిసరాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 16 మంది గాయపడగా, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే కాల్పులకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12:30 గంటలకు, భారత కాలమానం ప్రకారం ఉదయం సుమారు 11 గంటలకు కాల్పులు జరిగాయి. కాగా దేశంలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‍లో అర్థరాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే వారిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు, దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ కాల్పుల ఘటన పెద్ద ప్రమాదంగానే పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని ఆదీనంలోకి తీసుకున్న రొచెస్టర్‍ పోలీసులు ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు.