Vizag South MLA to leave TDP and join YSRCP

విశాఖ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడు ముఖ్యమంత్రి జగన్‍మోహన్‍రెడ్డిని తన కుమారుడితో సహా కలిసేందుకు ఆయన అపాయింట్‍మెంట్‍ తీసుకున్నారని సమాచారం. ఆయన కుమారుడికి ముఖ్యమంత్రి వైకాపా కండువా కప్పి ఆహ్వానిస్తారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ఆ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతారని వైకాపా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మీడియా ప్రతినిధులు ఆయనను ఫోన్‍లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.