దూకుడు గా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల ఖాళీగా ఉన్నాడా?

Director Srnu Vaitla Interview

శ్రీను వైట్ల....కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల ఆస్తిపరుడు....  
ఇరవైఒక్కేళ్ల క్రితం నీకోసం సినిమాతో డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆర్థికపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న 'నీ కోసం'  తొలి సినిమాతో సూపర్‌హిట్‌ సాధించి విజయంతో పాటు అవార్డును సొంతం చేసుకున్నారు. అంతే కాదు.. ఇండస్ట్రీ అటెన్షన్‌ను కూడా తనవైపు తిప్పుకున్న డైరెక్టర్‌. ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, రెఢీ, దుబాయ్‌శీను, కింగ్‌, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌షా.. ఇలా సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌, ఇండస్ట్రీ హిట్‌ మూవీస్‌తో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌  శ్రీనువైట్ల సెప్టెంబర్ 24న పుట్టిన రోజు సందర్భంగా, తెలుగుటైమ్స్.నెట్  ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ....

ఏడాది  బర్త్డే స్పెషల్ఏంటి?
సాధారణంగా షూటింగ్స్‌ జరిగే సమయంలో సెట్స్‌లో హంగామా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు  అలా లేవు. అయితే నేను కామ్‌గా ఉన్నా.. నా పిల్లలు కామ్‌గా ఉండరు. ఒకే నెలలో  మా ఇంట్లో జరుపుకునే మూడో బర్త్‌డే నాది (రూపా వైట్ల, చిన్న అమ్మాయి పుట్టినరోజు కూడా సెప్టెంబర్‌లోనే). నా పుట్టిరోజుకు పిల్లలు  మాత్రం ఎంతో హడావుడి చేస్తారు.

డైరెక్టర్గా మీ  సినీ ప్రయాణం...  ఎలా అనిపిస్తోంది..?
డైరెక్టర్‌గా  నాది 21  ఏళ్ల ప్రయాణం.. ‘నీకోసం’తో నా ప్రయాణాన్ని 1999లో ప్రారంభించాను. ఆ సమయంలో ఇంత మంచి కెరీర్‌ ఉంటుందని నేను అసలు  ఊహించలేదు.  చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి పేరు, పొజిషన్‌ వస్తుందని ఆ రోజు  అనుకోలేదు. సినిమా అంటే ప్యాషన్‌, పిచ్చితో డైరెక్టర్‌గా మారాను. మంచి సినిమాలు  తీయాలనుకునే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఎలాంటి ప్రణాళికలు, లెక్కలు  అంచనాలు వేసుకోలేదు. నెమ్మదిగా స్టార్ట్‌ అయిన జర్నీ చాలా పెద్దదిగా మారింది. అలాగని ఈ జర్నీ సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొన్నాను.   అయినా చాలా ఎంజాయ్‌ చేశాను. సినిమా అనేది లేకపోతే, సినిమాల్లోకి నేను రాకపోతే ఏమైయ్యేవాడిననే ఆలోచించలేను. అంతలా సినిమాతో మమేకమైయ్యాను. ఇప్పటికే 24 గంటలు  సినిమాలే నా ఆలోచన.

ప్రయాణంలో మీ హీరోల నుండి ఎలాంటి సపోర్ట్దొరికింది?
సింపుల్‌గా ఒక మాటలో చెప్పాంలటే హీరోల  సైడ్‌ నుండి ఎక్స్‌ట్రార్డినరీ సపోర్ట్‌ దొరికింది. నాతో ట్రావెల్‌ను వారు ఎంజాయ్‌ చేశారు. నేను కూడా వారి ట్రావెల్‌ను ఎంజాయ్‌ చేశాను. ఆ బాండింగ్ తోనే మంచి అవుట్‌పుట్‌ అందించగలిగాను.

కంటిన్యూగా సినిమాులు చేసిన మీకు ఈ మధ్యలో గ్యాప్‌ రావడానికి కారణమేంటి?
ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ లేదు. 2019లో నేను వాంటెడ్‌గా గ్యాప్‌ తీసుకున్నాను. ఏదో కంగారు కంగారుగా సినిమాలు  చేస్తే  బాగుండదని  నాకే అనిపించింది. ఇంతకు ముందు ప్రేక్షకులు  నా సినిమాను ఎందుకు అంతలా ఆదరించారు. రీసెంట్‌ సినిమా నా  ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఎందుకు అందుకోలేకపోయింది అని బాగా విశ్లేషించుకున్నాను. నాకొక అవగాహన వచ్చింది. దాంతో 2019లో కావాలనే గ్యాప్‌ తీసుకుని మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాను. 2020లో సినిమాని స్టార్ట్‌ చేయాల ని అనుకున్నాను. కానీ ఆ లోపు కోవిడ్‌ ఎఫెక్ట్‌ ప్రారంభమైంది. దీంతో సినిమాను స్టార్ట్‌ చేయలేకపోయాం. అదొక చిన్న డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపించింది. అయితే ఈ గ్యాప్‌లో నేను నా టీమ్‌ మెంబర్స్‌ గోపీమోహన్‌, కిషోర్‌తో కలిసి రెండు పక్కా స్క్రిప్టులను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటి వరకు నేను అలా రెడీగా ఉండలేదనే చెప్పాలి. అలాగే ఇక్కడ చెప్పాల్సిన విషయమేమంటే.. ఈ గ్యాప్‌లో నేను సోషల్‌ మీడియాను బాగా అబ్జర్వ్‌ చేయడం మొదలు  పెట్టాను. అందరూ సోషల్‌ మీడియాలో ఎలా రియాక్ట్‌ అవుతున్నారు. సినిమా పరంగా వారేం కోరుకుంటున్నారు అనే సంగతులను పరిశీలించాను. అలాగే నా సినిమాకు సంబంధించిన మీమ్స్‌ను కూడా ప్రేక్షకు ఎంజాయ్‌ చేయడాన్ని చూశాను. నా సినిమాను ప్రేక్షకులు  ఎందుకంతలా ఎంజాయ్‌ చేశారు అని ఆలోచించాను. అప్పుడు ఆడియెన్స్‌ నా నుండి ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. ప్రేక్షకులు   నానుండి ఎలాంటి సినిమాను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారో ఆ సినిమానే అందించాలని నిర్ణయించుకున్నాను అందులో ఎలాంటి డౌట్‌ లేదు.

ఢీసీక్వెల్తెరకెక్కించబోతున్నారనే వార్తలొస్తున్నాయి  నిజమెంత?
‘ఢీ’ సినిమాకు సీక్వెల్‌ చేయడం లేదు. అయితే ‘ఢీ’, ‘రెఢీ’, ‘దూకుడు’ సినిమాలు  ఇంత ఆదరణ ఎందుకు పొందాయంటే, నేను ఏ కథనైతే చెప్పాలనుకున్నానో ఆ కథను ఎలాంటి డివియేషన్‌ లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో చెప్పడమే. అదే నాకు బలంగా  మారింది. ఇక చేయబోయే సినిమాను అదే కోణంలో చెప్పానుకుంటున్నాను. నేను వేరే పంథాలో కథను నెరేట్‌ చేయాలనుకుంటే న్యాయం చేయలేను. కొన్ని సినిమా విషయంలో అదే నేను చేశాను. అందుకనే బండగుర్తుగా నా స్టయిల్‌ ఆఫ్‌ సీన్స్‌, కాన్సెప్ట్స్‌తోనే సినిమాలు  చేయానుకుని డిసైడ్‌ చేసుకున్నాను.

లాక్‌డౌన్‌ సమయంలో మీరేం చేశారు?
నా అప్ కమింగ్ మూవీ   షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకున్న సమయంలో ఈ  లాక్‌డౌన్‌ వచ్చింది. సరే! ఒకట్రెండు నెలలే కదా అని అనుకుంటే అది పెరిగిపోతూ వచ్చింది. దీంతో నేను, నా కుటుంబ సభ్యులు  ఇంటికే పరిమితం అయ్యాం. ఆ కారణంగా కాలు  బయటే పెట్టలేదు. నేను చూడకుండా ఉన్న ఇతర  సినిమాలను చూశాను. అలాగే వెబ్‌  సిరీస్‌లను చూశాను. నేను చూసిన వెబ్‌సిరీస్‌ల్లో 'డార్క్‌' నాకు బాగా నచ్చింది. అలాగే చాలా సిరీస్‌ను ఎంజాయ్‌ చేశాను. వెబ్‌సిరీస్ల‌నేవి థ్రిల్లర్  జోనర్‌లో ఎక్కువగా ఉంటున్నాయి.  నేను చూసి ఎంజాయ్‌ చేయగలను తప్పితే.. ఆ జోనర్‌లో సినిమాలు  చేయలేను. ఎందుకంటే ప్రేక్షకులు  నా నుండి ఫుల్ కమర్షియల్  ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న సినిమాలే కావాలని కోరుకుంటున్నారు.

డిజిటల్రంగం ప్రభావం సినిమాలపై ఎంత వరకు ఉండొచ్చు?
ఎప్పటికైనా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌నే ప్రేక్షకుడు కోరుకుంటాడు. కాబట్టి ప్రేక్షకులు  ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్‌ కావాలని అనుకోరు. రేపు పరిస్థితులు  చక్కబడిన తర్వాత థియేటర్స్‌ ఓపెన్‌ కాగానే జనం థియేటర్స్‌కు విరగబడి వస్తారని నా స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ప్రేక్షకుడికి ఓటీటీ మాధ్యమాలు  కాస్త ఉపశమనాన్ని అందిస్తున్నాయంతే.

వెబ్సిరీస్తెరకెక్కించే ఆలోచనేమైనా ఉందా?
వెబ్‌ సిరీస్‌ డైరెక్ట్‌ చేయమనే ఆఫర్‌ అయితే వచ్చింది కానీ.. నాకు అంతగా  ఆసక్తి లేదు. సినిమాలు చేయడానికే ఆసక్తిగా ఉన్నాను.

ప్రొడక్షన్హౌస్ను స్టార్ట్చేసే ఆలోచనేమైనా ఉందా?
ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసే ఆలోచనైతే ఉంది. ఎందుకంటే నాకు సినిమా మాత్రమే తెలుసు. నాకు సినిమానే అన్నీ ఇచ్చింది. కాబట్టి ఇక్కడే ఉంటాను. ఓపిక ఉన్నంత వరకు డైరెక్షన్‌ చేస్తాను. అలా లేని రోజున ఇండస్ట్రీలోనే ఉండేలా ప్లాన్స్‌ చేసుకుంటున్నాను. ప్రొడక్షన్‌ చేయడానికి నాకు ఇష్టమే. ఒక సినిమాకు దాదాపు ఇన్‌డైరెక్ట్‌గా ప్రొడక్షన్ కూడా‌ చేశాను.  ఆఎక్స్‌పీరియెన్స్‌ నాకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

తదుపరి చిత్రాలు
ఇది వరకు చెప్పాను కదాండీ..! రెండు స్క్రిప్టులను  పక్కాగా రెడీ చేశాను. కోవిడ్‌ లేకుండా ఉండుంటే సినిమా షూటింగ్‌ కూడా స్టార్ట్‌ కావాల్సింది. ఇప్పుడు నా దృష్టంతా ఆ సినిమాపైనే ఉంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తాను. రానున్న ఏడాది రెండు  సినిమాను వరుసగా  తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నాను.

సినిమాల  గురించి...
నీకోసం: ఫౌండేషన్‌ ఎవరూ వేయరు. నీకు  నువ్వే వేసుకోవాలి అని ప్రూవ్‌ చేసిన సినిమా. అవార్డులతో  పాటు మంచి అప్రిషియేషన్స్‌ను తీసుకొచ్చిన సినిమా. 

ఆనందం: పేరుకు తగ్గ సినిమా. ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా బ్యూటీఫుల్‌గా వర్కవుట్‌ అయ్యింది. ఆ సినిమా క్యాప్షన్‌లాగే లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అనిపించింది. అందుకే మా పెద్దమ్మాయికి ఆనంది అనే పేరు పెట్టుకున్నాను.
సొంతం: ఫన్‌ లవర్స్ ‌ అందరూ ‘సొంతం’ చేసుకున్న మూవీ. ఇందులో ఫొటో షూట్‌ చాలా సీన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌ అయ్యింది.
ఆనందమానందమాయే: కాన్ఫిడెన్స్‌ బూస్టర్‌. ఎక్కువ మంది యాక్టర్స్‌ని హ్యండిల్‌ చేయగనన్న కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది.
వెంకీ: వెం‘కీ’ మూవీ ఇన్‌మై కెరీర్‌. ఆ సినిమాలో ట్రైన్‌లో జనరేట్‌ అయిన అల్లరి జనరేషన్స్ ‌ మారినా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో  కంటిన్యూ అవుతూనే ఉంది.
అందరివాడు: గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విత్‌ ద లెజెండ్‌. అందరికీ దొరికేది కాదు
ఢీ‘ట్రెండ్‌ సెట్టర్‌’ అని అందరూ అంటుంటారు. ‘కష్టేఫలి’కి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ అని నేను అనుకుంటాను.
దుబాయ్శీను: చాలా ఎంజాయ్‌ చేసి చేశాం. ఆడియెన్స్‌ ఇంకా ఎంజాయ్‌ చేస్తూ చూశారు. అల్లరి.. అల్లరి
రెఢీ: బిగ్గెస్ట్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఇన్‌ మై కెరీర్‌. అన్నీ విధాలుగా  చాలా హ్యపీనెస్‌ ఇచ్చిన మూవీ.
కింగ్‌: లాంగ్‌ లివ్‌ ద కింగ్‌.. మీమ్స్‌లో మెమరీస్‌లో రోజూ ప్రెష్‌గా ఉండే సినిమా
నమో వెంకటేశకూల్‌ మూవీ, వెంకటేశ్‌ బాబులాంటి సెన్సిబుల్‌ హీరోతో పని చెయ్యడం.. ఆడియెన్స్‌ కూడా అంతే కూల్‌గా రిసీవ్‌ చేసుకోవడం చాలా హ్యాపీనెస్‌ ఇచ్చింది.
దూకుడు: హై పాయింట్‌ ఇన్‌ మై కెరీర్‌. థండర్స్‌ సక్సెస్‌. మహేశ్‌బాబుతో స్పెండ్‌ చేసిన టైమ్‌.. ఫ్యాన్స్‌ ఇచ్చిన అప్రిషియేషన్‌ వెల కట్టలేనిది.
బాద్షాఅద్భుతమైన సక్సెస్‌ అంతకు మించిన శాటిస్పాక్షన్‌. తారక్‌ని డైరెక్ట్‌ చేయడం, అతన్ని టాలెంట్‌ను దగ్గరనుండిచూడటం గ్రేట్‌ మెమొరీ.
ఆగడుడైనమిక్‌ ప్రెజంటేషన్‌. హీరోలోని వెర్సటాలిటీని చూపించిన మూవీ.
బ్రూస్లీ: బ్యూటీఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విత్‌ చరణ్‌.. ఎంజాయ్‌డ్‌ ఇట్‌.
మిస్టర్‌: నా కెరీర్‌లోనే ఎక్కువగా కష్టపడిన సినిమా. డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చిన మూవీ.
అమర్అక్బర్ఆంటోనిట్రైడ్‌ మై హ్యండ్‌ ఎట్‌ ఎక్స్‌పెరిమెంటింగ్‌. బట్‌ నోబడీ బర్ట్న్‌ దెయిర్‌ హ్యండ్స్‌. 

 


                    Advertise with us !!!