Tirumala Srivari Brahmotsavam from September 19 to 27

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ నిర్వహించారు. ఆలయం లోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ సాయం 6-7 గంటల మధ్య జరిగింది. స్వామివారి సేనాధిపతి విష్వక్సేన స్వామిని ఊరేగింపుగా యాగశాలకు తీసుకెళ్లి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని రంగనాయక మండపం, వాహనసేవలు నిర్వహించే కల్యాణోత్సవ మండపాన్ని విద్యుత్‍, పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.