Pawan Kalyan to resume shooting for Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన  26 వ సినిమా గా  "వకీల్ సాబ్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా బాలీవుడ్ పింక్ కి రీమేక్. ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా ప్రభావం వలన ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం చాలా ఆలస్యమైంది. ఇప్పటికి సగం మాత్రమే పూర్తి చేసుకున్న ఈ చిత్రం తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభించింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరిగి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారా అంటే అవున‌నే స‌మాధానం ఎక్కువగా వినిపిస్తోంది. వేణు శ్రీ‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ క‌పూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. వ్యాక్సిన్ వచ్చిన త‌రువాతే షూటింగ్లలో పాల్గొంటాను అని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో తెలియజేసాడు.

 

అయితే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ షూటింగ్ కొంత పార్టు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టే…! అందుకే తన వల్ల షూటింగ్ లేట్ అవ్వడం ఇష్టంలేక కొన్ని కండిషన్లతో షూటింగ్లో పాల్గొనడానికి ఓకే చెప్పేశాడట. ఆ కండిషన్స్ ఏంటంటే….ప్రస్తుతం పవన్ చతుర్మాస దీక్షలో వున్నారు. ఈ దీక్ష నవంబర్ నెలాఖరువరకు పూర్తి అవుంతుంది. కానీ దిల్ రాజు అప్పటి వరకూ వెయిట్ చెయ్యడం ఇష్టం లేక.. అక్టోబర్ నెల మధ్యలో  నుండే షూటింగ్  మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకు పవన్ ను కూడా ఒప్పించాడని తెలుస్తుంది. అయితే పవన్ మాత్రం…సాయంత్రం 6 గంటల త‌రువాత నేను పూజ చేసుకోవాలి… లేకపోతే దీక్షకు భంగం కలుగుతుంది. అలా జరిగితే షూటింగ్ చేయ‌న‌ని నిక్క‌చ్చిగా చెప్పేశాడట. కాబట్టి పవన్ కోసం 6లోపే షూటింగ్ కు ప్యాకప్ చెప్పెయ్యాలన్న మాట. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లోనూ, హరీష్ శంకర్ డైరెక్షన్ లోను సినిమాలు చెయ్యబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.