India s love for noodles makes it to GUINNESS WORLD RECORDS on ITC Ltd Sunfeast YiPPee! s 10th Anniversary

Sunfeast YiPPee!, ఇండియా మోస్ట్ పాపులర్ మరియు ప్రియమైన నూడల్స్ బ్రాండ్. 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులు దీనిపై తమకున్న ప్రేమనంతా కలిపి  YiPPee!  తింటూ వర్చువల్‌గా ఒకరికొకరు పంచుకున్నారు. ఈ అధ్బుతమైన క్షణాలను ఆస్వాదించడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా మలిచారు. ‘‘గంట వ్యవధిలో అత్యధికంగా నూడుల్స్ తింటూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసి రికార్డు సాధించారు. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి అధికారికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందుతుంది. దీంతో పాటు Sunfeast YiPPee! నుంచి కూడా పత్రం చేరుతుంది.

ఆన్ లైన్ ద్వారా అన్ని వయసుల వారు ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పండగతో YiPPee! అంటే యువత, పెద్దలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధమవుతుంది.  వినియోగదారుల విశ్వాసం, వారి మన్ననలతో YiPPee విలువ ఈ పదేళ్లలో ఎంతో పెరిగింది. మార్కెట్లో రూ.1000 కోట్లుగా విలువ కలిగిన అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. కస్టమర్ల ప్రోత్సాహంతో దేశంలోనే YiPPee! 2వ అతిపెద్ద ఇన్‌స్టంట్ నూడుల్ బ్రాండ్‌గా అవతరించింది.  YiPPee! ఇటీవల కాలంలో అత్యధికంగా అమ్మడువుతున్న బ్రాండ్‌గా అవతరించింది. వినియోగదారుల నిత్యావసరాల్లో ఇదో భాగంగా మారింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 50శాతం గ్రోత్ రేటు సంపాదించింది. ప్రతి దేశంలో చివరి మైలురాయి వరకూ ప్రతి ఒక్క కస్టమర్‌కు అందుబాటులో ఉండేలా కంపెనీ చేసింది. రికార్డు సమయంలో డెలివరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. మాకున్న డెలివరీ పార్టనర్ షిప్ వ్యవస్థ మరియు ITC కున్న విస్తృత నెట్‌వర్క్ ద్వారా డెలివరీ సరికొత్త విధానాలు అవలంభిస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. అంతేకాదు శుభ్రతతో పాటు, ఫిజికల్ డిస్టెన్స్ వంటి కఠిన నిబంధనలు పాటిస్తూనే ఈ కష్ట సమయంలో కూడా డెలివరీ సిస్టమ్ దెబ్బతినకుండా అందరికీ అందేలా చూస్తున్నాం.

2010లో మార్కెట్లోకి వచ్చిన YiPPee! మెరుగైన ప్రమాణాలతో తనదారి విస్తరించుకుంటూవస్తోంది. దీని  డిఎన్ఏ లోనే అత్యుత్తమ లక్షణాలు కలిగి ఉన్నాయంటున్నారు ITC లిమిటెడ్ఫుడ్ డివిజన్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్,  శ్రీ హేమంత్. ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండటమే కాదు.. వారి మనసు చూరగొని అత్యుత్తమ నూడుల్ బ్రాండ్ గా అవతరించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఫీట్ ద్వారా YiPPee! ఏస్థాయిలో వినియోగదారుల ప్రేమాభిమానాలకు సంపాదించుకుందో అద్దం పడుతుందన్నారు శ్రీ హేమంత్. భారతీయులు తమ బ్రాండ్ నూడుల్స్ నే ఏస్థాయిలో ఆదరిస్తున్నారో గ్లోబల్ ఆడియన్స్ చూపించారు అరుదైన అధ్బుత క్షణాలివన్నారు. తాము అమితంగా ఇష్టపడే YiPPee! నూడుల్స్ పై ఇంత ప్రేమను చూపించిన వినియోగదారులకు సదా రుణపడిఉంటామన్నారు. వారి మద్దతుప్రోత్సాహం YiPPee! పై ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. రానున్న దశాబ్ధానికి మరింత వినూత్నంగాసరికొత్తగా తీసుకెళ్లడానికి ఈ ఘట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు.

వినూత్నంగా ఉంటూ అద్భుతమైన అనుభూతిని, రుచిని అందించేలా సంప్రదాయ ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు భిన్నంగా మార్కెట్లోకి వచ్చింది YiPPee!. 2010లో లాంచ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ విభాగంలో రకరకాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ద్రుష్టిలో పెట్టుకుని తీసుకురావడం జరిగింది. ITC సంస్థకుండే బలమే దీనికి మూలాధారం. విభిన్న విభాగాల్లో కంపెనీకున్న వినియోగదారులు, వారి అభిరుచులు తెలిసిన సంస్థగా పేరు, నిపుణులు, బలమైన సరఫరా వ్యవస్థ, R&D లో అనుభవం. దీనికి తోడు ITC గ్రూప్‌లోని ఆహారపు అలవాట్లపై నిపుణులైన హోటల్ చెఫ్ లు, సంస్థకు చెందిన  ఆశీర్వాద్ అట్టా, వెజిటబుల్స్, మసాలా వంటి ముడిపదార్ధాలు అదనపు బలం. లాంగ్ స్లర్ప్ వర్తీ నూడుల్, స్పెషల్ సైంటిఫిక్ ప్రాసెస్ తో వినియోగదారులకు అధ్బుతమైన పోషకాలతో కూడిన నూడుల్స్ అందివ్వగలుగుతోంది. త్వరలో లాంగ్ మరియు నాన్ స్టికీ నూడుల్స్ కూడా రానున్నాయి. అన్ని వయసుల వారి అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తిని మరింతగా అభివృద్ధి చేసి కొత్తకొత్త మార్కెట్లలో విడుదల చేయడానికి రెడీ అవుతొంది సంస్థ. ఈ ఏడాది నుంచి YiPPee! నూడుల్స్ కు బ్రాండ్ అంబాసిడార్ గా మహేంద్ర సింగ్ ధోనీ రావడం మరో విజయం.

బ్రాండ్ వార్షికోత్సవ వేడుకలను కనులారా వీక్షించాలంటే మీరు Sunfeast YiPPee! అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యేకంగా రూపొందించిన పేజీలో చూడవచ్చు. ఎంతమంది ఈ వేడుకులో భాగస్వాములు అయ్యారో కళ్లారా చూసి మీరూ ఆస్వాదించవచ్చు.

YiPPee! ప్రస్తుతం ఇన్ స్టంట్ నూడుల్స్ మరియు పాస్తా కేటగిరిలో ఉత్పత్తులను అందిస్తోంది. YiPPee! నూడుల్స్ ప్రస్తుతం నాలుగు విభాగాలున్నాయి. మేజిక్ మసాలా, మూడ్ మసాలా, పవర్ అప్ మసాలా నూడుల్స్ మరియు క్విక్ మీల్జ్ కోవ్ స్యూ(Quik Mealz Kow Suey) ఉన్నాయి. ఇక పాస్తాలో అరు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.–  ట్రైకలర్ క్రీమీ కార్న్(Tricolour Creamy Corn), ట్రైకలర్ మసాలా (Tricolour Masala), టొమాటో చీజ్ (Tomato Cheese), మసాలా (Masala), చీజ్ (Cheese) మరియు సోర్ క్రీమ్ ఆనియన్ (Sour Cream Onion).  రానున్న రోజుల్లో YiPPee!  సరికొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వస్తోంది.

లింక్ కోసం Sunfeast YiPPee! యొక్క ఫేస్‌బుక్ ఈవెంట్ పేజ్ చూడండి: