apple-store-online-india-launch-september-23

అమెరికా టెక్‍ దిగ్గజ కంపెనీ ఆపిల్‍ భారత్‍లో ఐఫోన్‍ ప్రియులకు శుభవార్త చెప్పింది. తాము త్వరలో ఆపిల్‍ తొలి ఆన్‍లైన్‍ స్టోర్‍ను భారత్‍లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆపిల్‍ సీఈవో టిమ్‍ కుక్‍ ట్విటర్లో ప్రకటించారు. తద్వారా భారత్‍లో తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్లు తెలిపారు. తమకు ఇష్టమైన వారితో, చుట్టు ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం వినియోగదారులకు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే మా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, వారికి సేవలందించేందుకు మేం ఉత్సాహగా ఎదురుచూస్తున్నాం. ఇందు కోసం సెప్టెంబర్‍ 23న భారత్‍లో మా కంపెనీ తొలి ఆన్‍లైన్‍ స్టోర్‍ను ప్రారంభించనున్నాం అని టిమ్‍ కుక్‍ పేర్కొన్నారు.

ఆపిల్‍ సంస్థ ఇప్పటివరకు ఇండియాలో తన ఉత్పత్తులను థర్డ్ పార్టీలైన అమెజాన్‍, ఫ్లిప్‍ కార్ట్ వంటి ఆన్‍ లైన్‍ మార్కెట్లో విక్రయించింది. మరోవైపు 2021లో భారత్‍లో ఆపిల్‍ తొలి రిటైర్‍ స్టోర్‍ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.