President accepts Harsimrat Kaur Badal’s resignation

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి పదవికి అకాలీదళ్‍ నేత హర్‍సిమ్రత్‍ కౌర్‍ బాదల్‍ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్‍ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను ప్రధాని సిఫార్సుల మేరకు మరో మంత్రి నరేంద్రసింగ్‍ తోమర్‍కు అప్పగించారు. ఇప్పటికే తోమర్‍ వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‍ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులకు నిరసన రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‍సిమ్రత్‍ కౌర్‍ బాదల్‍ ప్రకటించిన విషయం తెలిసిందే.