2043 new corona positive cases in telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,043 కొవిడ్‍ పాజిటివ్‍ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802 మంది వైరస్‍ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,35,357 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 11 మంది మృతి చెందగా, మొత్తం 1,016 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 యాక్టివ్‍ కేసులున్నాయని, మరో 24,081 మంది హోం ఐసోలేషన్‍లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60 శాతం మరణాలు రేటు ఉండా, రికవరీ రేటు 81.02 శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 50,643 శాంపిల్స్ పరీక్షించగా, 1039 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,79,950 టెస్టులు చేసినట్లు వివరించింది.