Asia Game Changer award for NY based celebrity chef Vikas Khanna

ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు వికాస్‍ ఖన్నా దాతృత్వానికి తగిన గుర్తింపు లభించింది. కొవిడ్‍ 19 కారణంగా విధించిన లాక్‍డౌన్‍ సమయంలో ఆకలితో అలమటించిన లక్షలాది పేదలకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేసినందుకుగాను ఆయన్ను 2020 ఆసియా గేమ్‍ ఛేంజర్‍ పురస్కారం వరించింది. ఆసియా గేమ్‍ ఛేంజర్‍ పురస్కారం వరించింది. ప్రముఖ ఆసియా సొసైటీ సంస్థ ఈ అవార్డుకు ఎంపికైనవారి జాబితాను వెల్లడించారు. ఈ పురష్కారానికి ఎంపికైన ఆరుగురు ప్రముఖుల్లో భారత్‍కు చెందిన వ్యక్తి వికాస్‍ ఒక్కరే.

అమెరికాలోని మన్‍ హాటన్‍లో నివాసముంటున్న ఆయన ఫీడ్‍ ఇంఇయా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఆహారధాన్యాలు, వండిన ఆహార పదార్థాల రూపంలో 3.50 కోట్ల మందికి భోజనాలు, 35 లక్షల శానిటరీ ప్యాడ్లు, సుమారు 5 లక్షల మందికి చెప్పులు, 20 లక్షల మాస్కులు, తదితర నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాలా గొప్పవారితో పాటు నన్ను ఈ గౌరవంతో సత్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది అని వికాస్‍ అన్నారు. సెల్లో వాద్యకారుడు యోయోమా, టెన్నిస్‍ క్రీడాకారుడు నావొమీ ఒసాకా, కొరియాకు చెందిన సంగీతకారుల బృందం బీటీఎస్‍, ఆస్కార్‍ అవార్డు అందుకున్న పారాసైట్‍ చిత్ర నిర్మాణ మికీ లీ, ప్రముఖ వ్యాపారవేత్తలు, మానవతావాదులు  జో, క్లారా సాయ్‍లు ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు.