Donald Trump accused of sexual assault by former model Amy Dorris

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍పై మాజీ మోడల్‍ అమీ డోరిస్‍ సంచలన ఆరోపణలు చేశారు. 1997లో యూఎస్‍ ఓపెన్‍ టెన్నిస్‍ టోర్నమెంట్‍ సందర్భంగా న్యూయార్క్లోని వీఐపీ సూట్‍లో ఉన్న ట్రంప్‍.. తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. బలవంతంగా ముద్దుప్టెటడమే కాకుండా, గట్టిగా హత్తుకుని శరీరమంతా అసభ్యకరంగా తాకాడని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడు తనకు 21 ఏండ్లు ఉంటాయని చెప్పారు. ట్రంప్‍కు అప్పుడు 51 ఏండ్లు.