bathukamma-festivities-to-begin-from-oct-16

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్‍ 16 నుండి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగ•తి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చర్చించారు.

అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గాను,‘తెలంగాణ విద్వత్సభ’ ప్రతినిధులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి, పండుగ తేదీలపై చర్చించారు. అంతకంటే ముందు ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు, పండుగ తేదీలపై ఆన్‍ లైన్‍ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణాకే తలమాణికంగా నిలిచిందని మాజీ ఎంపీ కవిత గుర్తు చేశారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల పండుగ తేదీలపై కొంత సందేహాలు ఉన్నాయన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితుంతా చర్చించి ఈ సంవత్సరం పండగ తేదీలను శాస్త్ర ప్రకారం నిర్ణయించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ సంవత్సరం అధిక మాసాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రతి సంవత్సరం లాగ  భాద్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్‍) 16 వ తేదీన బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ జాగ•తి చాలా సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదించారని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా మేరకు అక్టోబర్‍ 16 తేదీన బతుకమ్మ పండుగను ప్రారంభించి, అక్టోబర్‍ 24 తేదీ వరకు తెలంగాణ జాగ•తి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కవిత తెలిపారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారని మాజీ ఎంపీ కవిత అన్నారు. పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్‍ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను మాజీ ఎంపీ కవిత కోరారు. ‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ తెలంగాన జాగ•తి రాష్ట యువత ఆద్యక్షులు కొరబోయిన విజయ్‍ కుమార్‍ ఇతర పండితులు, మాజీ ఎంపీ కవితను కలిసారు.