TTD invites CM Jagan Mohan Reddy for annual Brahmotsavams

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‍ కుమార్‍ సింఘాల్‍లు ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ను ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‍ జగన్‍కు శ్రీవారి ప్రసాదాలు అందజేసి, బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. వారి వెంట టీటీడీ అడిషనల్‍ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు.  ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది.