Vistara First airline to offer in flight WiFi internet on B787 9

ప్రైవేట్‍ రంగ విమానయాన సంస్థ విస్తార తమ బోయింగ్‍ 787-9 డ్రీమ్‍లైనర్‍ విమానాల్లో ఇన్‍-ఫ్లయిట్‍ వైఫై సేవలు అందించనుంది. నేటి నుంచి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‍ కింద పరిమిత కాలం పాటు విస్తార కస్లమర్లందరికీ వైఫై సేవలు ఉచితమని తెలిపింది. విస్తార ఇన్‍-ఫ్లయిట్‍ వైఫై సర్వీసులు అందించే తొలి భారతీయ ఎయిర్‍లైన్‍ కానుంది. ప్రస్తుతం తమకున్న రెండు డ్రీమ్‍లైనర్‍ విమానాలను ఢిల్లీ-లండన్‍ రూట్లో నడిపిస్తోంది.