India finds place in Trump s list of top drug transit and drug producing nations

ప్రపంచవ్యాప్తంగా భారత్‍ సహా 20 దేశాల్లో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) ఉత్పత్తి, అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతున్నట్టు గుర్తించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ చెప్పారు. ఆయా కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలు, వాటి మద్దతుదారులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని నొక్కి చెప్పారు. ఇప్పటికే బోలీవియా, వెనిజువెలా దేశాలు అంతర్జాతీయ నార్కో టిక్స్ ఒప్పందాలను పాటించడం లేదంటూ ట్రంప్‍ గత ఏడాదిగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఆఫ్గానిస్థాన్‍, భారత్‍, బహమాస్‍, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినియన్‍ రిపబ్లికన్‍ తదితర దేశాలను చేర్చారు. డ్రగ్స్ మాఫియాకు సహకరించే వారిలో వెనెజువెలా నియంత నికోలస్‍ మదురో ప్రధాన వ్యక్తి అని ట్రంప్‍ ఆరోపించారు. అమెరికా మిత్ర దేశాలైన కొలంబియా, పెరూలోనూ కోకాసాగు, కొకైన్‍ ఉత్పత్తి పెద్దఎత్తున జరుగుతోందని చెప్పారు. ప్రధానంగా మెక్సికోలో ఉన్న డ్రగ్‍ మాఫియాతో ఆ దేశ పౌరులతో పాటు అమెరికన్లకూ ముప్పు ఉందని డొనాల్డ్ ట్రంప్‍ ఆందోళన వ్యక్తం చేశారు.