water-protest-in-the-krishna-river-for-the-capital-amaravati-protest-with-black-balloons

నిరంకుశ పాలన నుంచి ఆంధప్రదేశ్‍ను కాపాడాలని అమరావతి రైతులు కృష్ణమ్మను వేడుకున్నారు. అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగేలా చూడాలని కోరుతూ ఉద్దండరాయునిపాలెంకు చెందిన మహిళలు, రైతులు, రైతు కూలీలు తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రం వద్ద కృష్ణా నదిలో జలదీక్ష చేశారు. కృష్ణమ్మకు సారె సమర్పించారు. నల్లరంగు బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అన్ని దీక్షా శిబిరాల్లోనూ కళ్లకు, నోటికి గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కంచాలను గరిటెలతో మోగించారు. ఆందోళనలు గురువారం 275వ రోజూ కొనసాగాయి.