dr-reddys-labs-share-price-news-dr-reddys-labs-gains-on-launching-eye-allergy-drop-in-us-market

అమెరికా విపణిలో ఓవర్‍ ది కౌంటర్‍ (ఓటీసీ) ఒలొపెటాడైన్‍ హైడ్రోక్లోరైడ్‍ ఆఫ్తాలమిక్‍ సొల్యూషన్‍ యూఎస్‍పీ 0.2 శాతం, 0.1 శాతలను విడుదల చేసినట్టు డాక్టర్‍ రెడ్డీస్‍ లేబోరేటరీస్‍ లిమిటెడ్‍ ప్రకటించింది. యూఎస్‍ఎఫ్‍డీఏ ఆమోదంతో ఈ  ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ఆవిష్కరించామని డాక్టర్‍ రెడ్డీస్‍ వివరించింది. ఈ ఔషధం ఆవిష్కరణతో ఓటీసీ ఐ కేర్‍ రంగంలోకి అడుగుపెట్టామని డాక్టర్‍ రెడ్డీస్‍ లేబొరేటరీస్‍ నార్త్ అమెరికా జెనరిక్స్ సీఈవో కికుచి వెల్లడించారు.