Two US based law firms file class action suits against HDFC Bank

తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించి, ఇన్వెస్టర్లను నష్టపర్చిందంటూ ప్రైవేటు రంగ హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకుపై అమెరికా కోర్టులో క్లాస్‍ యాక్షన్‍ దావా దాఖలైంది. రోసెన్‍ లీగల్‍ సంస్థ ఈ పిటీషన్‍ వేసింది. ఇందులో బ్యాంకు ఎండీ ఆదిత్య పురి, ఆయన వారసుడిగా ఎంపికైన శశిధర్‍ జగదీశన్‍, కంపెనీ సెక్రటరీ సంతోష్‍ హల్ద్నాకర్‍ల పేర్లను ప్రతివాదులుగా చేర్చింది. హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్‍ వాహన పైనాన్స్ విభాగంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రస్తావిస్తూ రోసెన్‍ లీగల్‍ ఆరోపణలు చేసింది. వేల సంఖ్యలో ఇన్వెస్టర్లు నష్టపోయి ఉంటారని చెబుతున్నపటికీ నిర్ధిష్టంగా ఎంత నష్టపరిహారం కోరుతున్నదీ మాత్రం పేర్కొన్నలేదు.