న్యూయార్క్ ప్రజలు కోవిడ్-19 పరీక్ష నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు: ఎన్.వై.సి అధికారులు

New York City finds a way to speed testing

అమెరికా నెమ్మదిగా కోవిడ్ -19 జాగర్తలు తీసుకుంటూ మునుపటి జీవన శైలిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగం గా న్యూ యార్క్ నగరం అత్యంత ప్రతిష్టాత్మకమైన పూర్తి స్థాయి పునః ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణం లో న్యూయార్క్ నగర ప్రజలు కోవిడ్ -19 పరీక్ష నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ ఆలస్యం పై ప్రభుత్వం ఇప్పటికే చాలా ఫిర్యాదుల అందుకోగా కోవిడ్ -19 పరీక్ష నివేదిక ఆలస్యాన్ని తగ్గించడానికి న్యూయార్క్ నగర అధికారులు గురువారం 17 సెప్టెంబర్ నుంచి మాన్హాటన్లో ఒక కోవిడ్ -19 పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మాన్హాటన్లోని ఈ కొత్త కోవిడ్ -19 పరీక్ష కేంద్రానికి సంబంధించిన పాండమిక్ రెస్పాన్స్ ల్యాబ్‌ను ఒక చిన్న రోబోటిక్స్ సంస్థ నడపనున్నారు అని కోవిడ్ -19 వ్యాప్తి చెందుతూ ఉండడంతో న్యూయార్క్ ప్రజలు కోవిడ్ -19 పరీక్ష నివేదిక కోసం పెద్ద ప్రయోగశాల సంస్థలపై ఆధారపడటం కంటే ఈ కొత్త సదుపాయం న్యూయార్క్ నగరవాసులకు 24-48 గంటలలోపు కోవిడ్ -19 పరీక్ష నివేదిక అందిస్తుంది అని అధికారులు తెలిపారు.

ఇప్పటికే న్యూ యార్క్ నగరం లోని కోవిడ్ -19 పరీక్ష కేంద్రాలు వారానికి 200,000 పైగా నమూనాలు పరీక్షిస్తుండగా ఫస్ట్ అవెన్యూ అండ్ ఈస్ట్ 29 స్ట్రీట్ భవనం లోని 12 వ అంతస్తు లో ఉన్న ఈ కొత్త పరీక్ష కేంద్రం అదనంగా 40,000 పరీక్షలను చేయగలదు అని అధికారులు తెలిపారు.