president vice president birthday wishes to pm modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ 70వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ట్విట్టర్‍ ద్వారా స్పందించారు. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ జీవన విలువలు పాటిస్తూ, ప్రజాస్వామ్య సాంప్రదాయ ఆదర్శానాన్ని ప్రదర్శిస్తూ దేశాన్ని అంతర్జాతీయంగా ఉన్నతస్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం అన్నారు.