Indian origin author Avni Doshi on Booker Prize shortlist

బుకర్‍ ఫ్రైజ్‍ 2020 రేసులో దుబాయ్‍లో నివసిస్తున్న భారత సంతతి రచయిత్రి అన్వి దోషి నిలిచారు. ఆరుగురు సభ్యుల షార్ట్లిస్టులో ఆమె పేరు ఉంది. అన్వి తొలి నవల బర్టన్ సుగర్‍ గానూ ఆమె రేసులో నిలిచారు. ఈ షార్ట్లిస్టును లండన్‍లో వర్చువల్‍గా ఆవిష్కరించారు. తల్లికూతుళ్ల మధ్య అసాధారణ స్వచ్ఛమైన, వీడదీయలేని వాస్తవికమైన బంధాన్ని అద్భుతంగా వర్ణించినందుకు గానూ అన్వి దోషికి ఎంట్రీ లభించిందని జడ్జీలు వెల్లడించారు. అక్టోబర్‍ 2019 నుంచి సెప్టెంబర్‍ 2020 మధ్య కాలంలో ప్రచురితమైన 13 నవలను జడ్జీలు పున పరిశీలించిన తర్వాత ఈ షార్ట్ లిస్టులను ప్రకటించారు. విజేతకు నవంబర్‍లో 50వేల పౌండ్లను అందజేస్తారు.