125-foot-ambedkar-statue-in-hyderabad-prototype-unveiled

హైదరాబాద్‍ హుస్సేన్‍సాగర్‍ తీరంలో అంబేడ్కర్‍ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.146.5 కోట్ల వ్యయంతో 125 అడుగుల ఎత్తు,  45.5 అడుగుల వెడల్పుతో 96.19 మెట్రిక్‍ టన్నుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 7.91 లక్షల కిలోల స్టీలునూ ఉపయోగించనున్నామని మొత్తం 11.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంబేడ్కర్‍ విగ్రహ నమూనాను మంత్రులు ఈటల రాజేందర్‍, కొప్పుల ఈశ్వర్‍, సత్యవతి రాథోడ్‍ శాసనసభ కమిటీ హాలులో ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్‍లు బాల్క సుమన్‍, బాలరాజు, రేగ కాంతారావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‍లతో కలిసి వారు మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికంగా అంబేడ్కర్‍ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

అంబేడ్కర్‍ 125వ జయంతి  సందర్భగా సీఎం కేసీఆర్‍ హామీ ఇవ్వగా అందుకు అనుగుణంగా జీవో వచ్చింది. 11 ఎకరాల్లో అంబేడ్కర్‍ పార్కు కూడా ఏర్పాటవుతుంది. ఇందులో మ్యూజియం, గ్రంథాలయం ఉంటాయి. సీఎం కేసీఆర్‍కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనకు దళిత, గిరిజన బీసీ, మైనారిటీ వర్గాలు రుణపడి ఉంటాయి అని మంత్రులు తెలిపారు. అనంతరం మంత్రులు కేటీఆర్‍తో భేటీ అయి విగ్రహం నమూనాను చూపించారు.