Union Minister Nitin Gadkari Tests Coronavirus Positive

కేంద్ర రోడ్డు రవానా, రహదారుల శాఖ మంత్రి నితిన్‍ గడ్కరీ తనకు కరోనా పాజటివ్‍ వచ్చినట్లు వెల్లడించారు. మంగళవారం నీరసంగా ఉన్నట్లు అనిపించటంతో వైద్య పరీక్షలు చేసుకోగా కరోనా వైరస్‍ సోకినట్లు తేలిందని ఓ ట్వీట్‍ ద్వారా ఆయన  తెలియజేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, స్వీయ ఏకాంతంలో ఉన్నానని తెలిపారు. గత కొద్ది రోజుల్లో తన కాంటాక్ట్లోకి వచ్చిన వ్యక్తులు కొవిడ్‍ పరీక్షలు చేయించుకోవాలని మరో ట్వీట్‍లో పేర్కొన్నారు.