Prime Minister Narendra Modi Birthday Seva Saptah

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 70వ వసంతలోకి అడుగిడనున్నారు. ఈ సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్‍-ఫిన్లాండ్‍ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆ దేశ ప్రధాని సనా మారిన్‍ ఆకాంక్షించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‍ గవర్నర్‍ కిరణ్‍ బేడీ, రాజస్థాన్‍ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.