prabhas-nag-ashwins-sci-fi-thriller-to-have-the-second-heroine-too

ఉందని అనుకుంటున్నారు ప్రభాస్ సరసన ఇప్పటికే రాధేశ్యామ్ లో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే మరో సారి జత కట్టనుందని తెలిసింది. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కు జోడీగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. కాగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇక దీని అనంతరం యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ లో ప్రభాస్ నటించనున్నారు. ఇటీవల ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నాయకి దీపికా పదుకొనె తొలిసారిగా నటించనున్న ఈ సినిమాని ఎంతో భారీ లెవెల్లో నిర్మించనున్నారు నిర్మాత అశ్విని దత్.  

కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫిలిం నగర్ వారాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. దానిని బట్టి ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కూడా ఉండనుందని, అయితే ఆ పాత్ర కోసం పూజా హెగ్డే ని ఇటీవల ఎంపిక చేశారట దర్శకనిర్మాతలు. ఓవైపు ప్రభాస్ తో రాధేశ్యామ్ లో నటిస్తూ మరోవైపు తదుపరి ఆయన నాగఅశ్విన్ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో కూడా నటించనున్న పూజా ఏకంగా రెండు ఛాన్స్ లు కొట్టేసిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.