COVID 19 will go away because of herd mentality says Donald Trump

ప్రపంచమంతా కరోనా వైరస్‍తో విలవిల్లాడుతూ వ్యాక్సిన్‍ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‍ అవసరం లేకుండానే కరోనా వైరస్‍ దానంతట అదే పోతుందన్నారు. ఓ మీడియా సంస్థలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‍ లేకుండానే కరోనా దానంతట అదే కాలంతో పాటే పోతుంది. మీలో హెర్డ్ మెంటాలిటీ అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అది పోతుంది అని ట్రంప్‍ అన్నారు. మామూలుగా వైద్య నిపుణులు కరోనా వచ్చిన దగ్గరి నుంచి వాడుతున్న పదం హెర్డ్ ఇమ్యూనిటీ. కానీ ట్రంప్‍ వాడిన పదం హెర్డ్ మెంటాలిటీ. హెర్డ్ ఇమ్యూనిటీకి బదులు ఆయన హెర్డ్ మెంటాలిటీ అన్నారు? ఆయన చెప్పిన దానికి ఇంకేమైనా అర్థం ఉందో ఆయనకే తెలియాలి.