Coronavirus vaccine could be ready in a month says Donald Trump

కరోనా వైరస్‍ వ్యాప్తి చెందకుండా అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ అమెరికాలో కరోనా వైరస్‍ పాజిటివ్‍ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కీలక ప్రకటన చేశారు. కరోనా కట్టడికి కోవిడ్‍ 19 వ్యాక్సిన్‍ 3 లేదా 4 వారాల్లో సిద్ధంగా ఉంటుందని ట్రంప్‍ ప్రకటించారు. కరోనా వైరస్‍ నియంత్రణకు వ్యాక్సిన్‍ మూడు లేదా నాలుగు వారాల్లో సిద్ధంగా ఉండవచ్చని ట్రంప్‍ చెప్పారు. మునుపటి పరిపాలన టీకా తీసుకోవడానికి బహుళా సంవత్సరాలు పట్టేదని అన్నారు.