2273 new corona positive cases in telangana

తెలంగాణలో కరోనా వైరస్‍ రోజు రోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2273 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‍ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,62,844గా ఉంది. ఇందులో 1,31,447 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్‍ కేసులు ఉన్నాయి. కాగా కరోనాతో 24 గంటల్లో కొత్తగా 12 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 996కి చేరింది. కేసుల వారిగా చూస్తే.. జీహెచ్‍ఎంసీలో 325, కరీంనగర్‍లో 122, మేడ్చల్‍ లో 164, నల్గొండలో 175, రంగారెడ్డి 185, వరంగల్‍ అర్బన్‍ లో 114 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 80.71 శాతంగా ఉండగా, మంగళవారం 55,636 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.