trump-claims-he-wanted-to-assassinate-syrian-president-assad-but-mattis-opposed-it

సిరియా అధ్యక్షుడు బషర్‍ అల్‍ అసద్‍ను చంపడానికి 2017 లోనే తాను ఆదేశాలివ్వాలనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. అయితే నాటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్‍ తనను వారించారని పేర్కొన్నారు. సొంత పౌరుల ఊచకోతకు, విదేశీయుల చిత్రవధకు ఆదేశాలివ్వడం వంటి యుద్ధ నేరాలకు అసద్‍ పాల్పడినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా మ్యాటిస్‍పైనా ట్రంప్‍ విమర్శలు చేశారు. విజయం ఎలా సాధించాలో ఆయనకు తెలియదన్నారు. మ్యాటిస్‍ వైదొలిగాక ఉగ్రవాదంపై పోరులో తాము ఎంతో పురోగతి సాధించినట్లు చెప్పారు.